Ragidi Laxma Reddy, Chairman of Madhura Charitable Trust, Uppal Constituency Congress Party Leader, under the auspices of Madhura Charitable Trust, in a government primary school at Lakshmi Nagar, Mallapur Division, Uppal.
ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ఆర్ ఎల్ ఆర్
ఈరోజు మల్లాపూర్ డివిజన్ లక్ష్మీ నగర్ లొ గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు ప్లేట్లను తన చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
రాగిడి లక్ష్మారెడ్డి గారుమాట్లాడుతూ తాను గత 25 సంవత్సరాల నుండి మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు తన వంతు సహాయంగా నోటి పుస్తకాలు, ప్లేట్లు, క్రీడా సామాగ్రి మరియు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు పారితోషకం తో పాటు ఆర్థికంగా పై చదువులు చదవలేని విద్యార్థిని విద్యార్థులకు తమ ట్రస్టు ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేయడం జరిగింది అని *రాగిడి లక్ష్మారెడ్డి* **తెలియజేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజి రెడ్డి గారు ప్రైవేటు పాఠశాలలో ప్రతి సంవత్సరం నిర్వహించే స్కూల్ అన్యువల్ డే ను ఈ సంవత్సరము తమ పాఠశాలలో నిర్వహిస్తామని అన్యువల్ డే నిర్వహణకు గాను తమ వంతు సహాయం సహకారాలు అందించాలని* *రాగిడి లక్ష్మారెడ్డి గారిని* *కోరడం జరిగింది. వెంటనే స్పందించిన *రాగిడి లక్ష్మారెడ్డి గారు* *తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
రాబోవు రోజుల్లో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లో గల ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపడతామని లక్ష్మారెడ్డి గారు తెలియజేశారు.