
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి *మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,* *ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు* మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం లో అన్ని డివిజన్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని, మా ఈ ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉపాధి కల్పన ధ్యేయంగా కుట్టుమిషన్లు, అల్లికలు, ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమానాలు విదేశీ చదువులకు ప్రోత్సాహకాలు అందిస్తూ, వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ మరెన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని తెలియజేశారు.