24- Hour Service:

+917207934545 , +914079687716

Madhura Charitable Trust Chairman Ragidi Laxma Reddy participated in International Women’s Day celebrations.

జయహో.. జనయత్రి…అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాగిడి
👉 ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం వద్ద నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన *మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు.
👉 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మధుర చారిటబుల్ ట్రస్ట్ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం వారు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు ఆటపాటలతో సంతోషంగా గడపడం జరిగింది. ఈ సంస్కృతి వేడుకల్లో పాల్గొన్న చిన్నారులకు *మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి గారు* నగదు బహుమానం ప్రధానం చేయడం జరిగింది
👉 కార్యక్రమాన్ని ఉద్దేశించి *రాగిడి లక్ష్మారెడ్డి గారు* మాట్లాడుతూ ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్నింటి సగం అంటూ ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న మహిళా మణులు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. విధిరాతను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారు మహిళల స్థితిగతులు బాగుపడనిది సమాజం అభివృద్ధి చెందదు అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ, మహిళా స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు అని *రాగిడి లక్ష్మారెడ్డి గారు* కొనియాడారు.

Leave A Comment